* ఓటీటీ లో రిలీజ్ కాబోతున్న ” ది ఫామిలీ స్టార్ “
* ఏప్రిల్ 26న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
* యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న ” ది ఫామిలీ స్టార్ “
హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా నటించిన లేటెస్ట్ ఫిలిం “ది ఫామిలీ స్టార్” ఏప్రిల్ 5న రిలీజ్ అయ్యి యావరేజ్ గా నిలిచింది. పరుశురాం దర్శకత్వం లో గీతా గోవిందంతో హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ “ఫామిలీ స్టార్ తో మళ్ళీ హిట్ కొడతాడని అందరూ భావించారు. కానీ మూవీ ప్లాప్ అయ్యింది. 50 కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. 35 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
అయితే ఓ.టి.టి. లో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వేచి చూస్తున్న మూవీ లవర్స్ కు అమెజాన్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 26 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతుంది అని అనౌన్స్ చేసింది. విజయ్ దేవరకొండ లీడ్ రోల్ లో నటించగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేయగా, పరుశురాం దర్సకత్వం వహించారు.