- పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి మహేశ్వరి
- గత ఏడాది ప్రెగ్నన్సీ అనౌన్స్ చేసిన మహేశ్వరీ
- కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు, సినీ ప్రముఖులు
బుల్లితెర నటి మహేశ్వరి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. రెగ్యులర్ గా సీరియల్స్ చూసే ప్రేక్షకులకు ఈమే సుపరిచితమే. వదినమ్మ సీరియల్ తో మహేశ్వరీ బాగా పాపులారిటీని సంపాదించుకుంది. అంతేకాదు పలు సీరియల్స్ లో నటిస్తూ, ఇస్మార్ట్ జోడీ లో తన డాన్స్ టాలెంట్ ను చూపించి ప్రేక్షకులను మెప్పించింది.
అయితే కెరీర్ మంచిగా సాగుతున్న టైం లో పెద్దలను ఎదిరించి మరీ టాలీవుడ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న శివనాగ్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఈ దంపతులకి ఓ కూతురు ఉంది. అయితే గత ఏడాది తన ప్రెగ్నన్సీని అనౌన్స్ చేసిన మహేశ్వరీ తాజాగా మాకు బిడ్డ పుట్టింది అంటూ ఇంస్టా లో ఫాలోయర్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చారు. అయితే పుట్టింది ఆడపిల్లా మగపిల్లాడా అనేది ఈ జంట ఇంకా రివీల్ చేయలేదు.
ఇక మా బుజ్జాయికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి అంతో ఈ జంట ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. దీంతో నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు బుల్లితెర నటి మహేశ్వరికి కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు.
View this post on Instagram