- మే 8న ఉప్పల్ స్టేడియం వేదికగా ఐ.పీ.ఎల్ మ్యాచ్
- తలపడనున్న సన్ రైజర్స్ , లక్నో సూపర్ జెయింట్స్
- స్పెషల్ బస్సులు నడపనున్న టి.ఎస్.ఆర్.టి.సి సంస్థ
- 24 రూట్లలో 60 ప్రత్యేక బస్సులు
రేపు బుధవారం నాడు ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న ఐ.పీ.ఎల్ మ్యాచ్ టి.ఎస్.ఆర్.టి.సి సంస్థ 60 ప్రత్యేక బస్సులను నడపనుంది. రేపు ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో సన్ రైజర్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఐ.పీ.ఎల్ మ్యాచ్ జరగనుంది.
24 రూట్లలో సాయంత్రం 6 నుండి రాత్రి 11.30 వరకు ఈ స్పెషల్ బస్సులు నడవనున్నాయి. కోఠి, చార్మినార్, కె.పి.హెచ్.బి, బి.హెచ్.ఈ.ఎల్, జీడిమెట్ల, మియాపూర్, కొండాపూర్, ఎల్.బి నగర్ లాంటి పలు రూట్లలో టి.ఎస్.ఆర్.టి.సి బస్సులను నడపనుంది.
మ్యాచ్ ముగిసిన తరువాత ఈ బస్సులు ప్రేక్షకులను తమ తమ గమ్యస్థానాలకు చేర్చనున్నాయి. బస్సులు ఎక్కేటప్పుడు ప్రేక్షకులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా టి.ఎస్.ఆర్.టి.సి సంస్థ అధికారులు సమీక్షించనున్నారు.