- టిల్లు స్క్వేర్ తో సక్సెస్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ
- ప్రేక్షకులను కామెడీతో అలరించిన టిల్లు స్క్వేర్
- ఓ.టి.టి లో అడుగు పెట్టనున్న టిల్లు స్క్వేర్
- ఏప్రిల్ 26 న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
2022 ఫిబ్రవరిలో వచ్చిన DJ టిల్లు తో సక్సెస్ కొట్టిన సిద్ధూ జొన్నలగడ్డ రీసెంట్ గా రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ తో అంతకు మించి సక్సెస్ అందుకున్నాడు. మార్చ్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన టిల్లు స్క్వేర్ నవ్వులు పండించడంతో మూవీ బాగుందని ఆ నోటా ఈ నోటా పాకి ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేసింది.
దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టి ప్రపంచ వ్యాప్తంగా 125 కోట్లు కలెక్ట్ చేసి అందరిని ఆశ్చర్య పరిచింది. అయితే తాజాగా టిల్లు స్క్వేర్ OTT లోకి అడుగు పెట్టనుంది.
ప్రముఖ OTT ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ లో ఈ నెల 26 నుండి స్ట్రీమింగ్ అవ్వనుంది అని నెట్‌ఫ్లిక్స్ ఎక్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఒక్క తెలుగు లోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ , మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానుందని తెలిపింది.