18
Feb
తమిళనాడు ప్రజలు ఇప్పుడు పీచు మిఠాయిని ఇష్టంగా తినాలన్న తినలేరు. ఎందుకంటే పీచు మిఠాయి తయారీదారులు, అందులో రోడమిన్-బి అనే పదార్ధం కలుపుతున్నట్లు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులకి తెలిసింది. ఫుడ్ ఎనాలిసిస్ డిపార్ట్మెంట్ వారు కొన్ని శాంపిల్స్ సేకరించి పరీక్షించి చూడగా ఇది నిజమని తేలింది. రోడమిన్-బి పదార్ధాన్ని టెక్స్టైల్ డై లో వాడుతారు., ఇది ఓ కెమికల్ అని, కలిపిన పదార్ధాల్ని తింటే ఆరోగ్యం పాడవుతుందని, కాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని , అందుకే పీచు మిఠాయి విక్రయాల్ని నిషేధించినట్లు తమిళనాడు హెల్త్ మినిస్టర్ ఎం.ఏ. సుబ్రమణియన్ తెలిపారు. ఇక నుండి ఎవరైనా ఈ కెమికల్ పదార్ధం కలిపిన ఆహార ఉత్పత్తుల్ని తయారుచేసినా,అమ్మినా,ప్యాకింగ్ చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుని కఠినంగా శిక్షిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే పాండిచ్చేరి లో పీచు మిఠాయి నిషేధం ఉంది. తాజాగా ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో కూడా నిషేధించడంతో పీచు మిఠాయి…