22
Apr
హైదరాబాద్ లో విషాదం వాటర్ సంప్ లో పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి! సీసీటీవీలో చిక్కిన దృశ్యం గచ్చిబౌలిలో ఘటన గచ్చిబౌలిలోని అంజయ్య నగర్లో గల ఓ హాస్టల్ లో ఆదివారం నాడు విషాదం చోటు చేసుకుంది. 22 ఏళ్ల షైక్ అక్మల్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి బయట సరకులు తీసుకుని హాస్టల్ లోపలికి వెళ్తుండగా వాటర్ సంప్ లో పడి తలకి తీవ్రగాయాలు అవడంతో మృతి చెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. సీసీటీవీ లో రికార్డ్ అయిన దృశ్యం ప్రకారం షేక్ అక్మల్ వాటర్ సంప్ లో పడిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ లో నివసించే భార్య, భర్తలు మొదట ఈ విషయాన్ని గమనించారు. వెంటనే సదరు వ్యక్తి సంప్ లోకి వాటర్ పైపు జారవిడిచాడు. అయితే ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఆ వ్యక్తి తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. ఈ ఘటన…