08
Apr
అనకాపల్లిలో నిన్న జరిగిన మీటింగ్ ముగుంచుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే హైదరాబాద్ వచ్చిన తరువాత ఈరోజు తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని కలవడానికి పవర్ స్టార్ మరియు నాగబాబు విశ్వంభర మూవీ సెట్స్ కి వెళ్లారు. ప్రస్తుతం హైదరాబాద్ కి 80 కి.మీ. దూరంలో ఉన్న పోచంపల్లి ప్రాంతంలో విశ్వంభర షూటింగ్ జరుగుతుంది. అయితే అక్కడికి వెళ్లిన పవన్ కళ్యాణ్, నాగబాబు మెగాస్టార్ చిరు ని ఆత్మీయంగా కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి కొద్ది సేపు చర్చికున్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి , మెగాస్టార్ చిరు 5 కోట్ల చెక్కును అందజేశారు. జనసేన పార్టీ ఫండ్ కు ఈ పెద్ద మొత్తాన్ని చిరు డొనేట్ చేశారు. రాబోయే ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తాడని తనకి నమ్మకం ఉందని మెగాస్టార్…