చైనాలోని జుహాయ్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. సోమవారం రాత్రి ఓ కారు వేగంతో వ్యాయామం చేస్తున్న వారిపై దూసుకెళ్లడంతో 35 మంది మరణించగా, 43 మంది గాయపడ్డారు. చైనా పోలీసులు మంగళవారం దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు. 62 ఏళ్ల వయసు గల ఫాన్ అనే వ్యక్తి, జుహాయ్ స్పోర్ట్స్ సెంటర్ గేటును బలవంతంగా ఢీకొని లోపలికి ప్రవేశించి, వ్యాయామం చేస్తూ ఉన్న వ్యక్తులను తన కారుతో వేగంగా ఢీకొట్టాడు, దాని వల్ల 35 మంది చనిపోగా, పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు అని పోలీసులు తెలిపారు.
ఈ ఘటన తరువాత కారు డ్రైవర్ కత్తితో తనను తాను గాయపరుచుకుంటూ ఉండగా పోలీసులు నిలువరించి వెంటనే ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం అతడు కోమాలో ఉండడంతో ప్రశ్నించటానికి వీలు కాలేదు పోలీసులు తెలిపారు.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గాయపడిన వారికి తక్షణ సహాయక చర్యలు అందించాలని, నిందితుడికి చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసు అధికారులని ఆదేశించారు.ఈ ఘటన కారణంగా భద్రత మరింత పెంచారు.