షణ్ముఖ్ జస్వంత్ గురించి తెలుగువారికి పెద్దగా పరిచయం అవసరం లేదు యూట్యూబర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ దీప్తి సునయనతో రిలేషన్ షిప్ లో ఉన్న టైం లో బిగ్‌బాస్ లో అవకాశం రావడం. ఆ షో లో సిరితో అతడు సన్నిహితంగా ఉండటం వల్ల దీప్తితో బ్రేకప్ జరిగింది. ఆ తర్వాత అతని చుట్టూ ఉన్న పరిస్థితులు మరింత దిగజారాయి, డ్రగ్స్ కేసు కు సంబంధించి అతను అరెస్టయి మళ్ళీ బయటపడ్డాడు.
అయితే ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ప్రెస్ మీట్‌లో షణ్ముఖ్ ఎమోషనల్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ, “నా జీవితంలో ఎంత ప్రేమను చూసానో, అంత నెగెటివిటీని కూడా చూశాను. వైజాగ్‌లో షార్ట్ ఫిలిమ్స్ చేసే నేను హైదరాబాద్ వచ్చి కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు చేశాను. నాకు ఎలాంటి సపోర్ట్ లేదు, నేను అమ్మానాన్నలను బాగా చూసుకోవాలని అనుకున్నాను.
అన్నీ సాఫీగా సాగిపోతున్న టైం లో ఎవరో చేసిన తప్పుకు నన్ను బ్లేమ్ చేస్తూ అనేక ఆరోపణలు చేశారు. ఆ చెడ్డ పేరు నాకు మాత్రమే ఆపాదించకుండా, ఇందులోకి నా కుటుంబాన్ని కూడా లాగారు. ఫ్యామిలికి అండగా ఉండాలని ప్రతి ఒక్క కొడుకు అనుకుంటాడు. అయితే నా వల్లే కుటుంబానికి చెడ్డ పేరు. అమ్మా, నాన్న నన్ను క్షమించండి. నా వల్లే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటూ షణ్ముఖ్ కంటతడి పెట్టుకున్నాడు.
మనం సక్సెస్‌లో ఉన్నప్పుడు చాలా మంది మన చుట్టూ ఉంటారు, కానీ మనం కష్టాల్లో ఉన్నప్పుడు పక్కన ఉండే వాళ్ళే నిజమైనవాళ్లు. నాపై ఒక మచ్చ ఉన్న సమయంలో కూడా లీలా వినోదం టీమ్ నాకు ఈ అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది,” అని అన్నారు శణ్ముఖ్ జస్వంత్.
షణ్ముఖ్ మాట్లాడుతూ, “నేను జీవితంలో చాలా కష్టాలు చూశాను. నా తల్లిదండ్రుల బాధను చూడడం చాలా కష్టతరం అయ్యింది. ఇప్పుడు నా లక్ష్యం ఒకటే సక్సెఫుల్ నటుడిగా నా ప్రతిభ నిరూపించటం.”
“ఈ రోజు కోసం నేను చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నాను. నేను హీరో కావాలనే కల ETV Winలో లీలా వినోదం విడుదలతో నిజమవుతోంది.” అంటూ షణ్ముఖ్ తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు.
తన జర్నీని గుర్తుచేసుకుంటూ, “గత రెండు సంవత్సరాలు చాలా కష్టంగా గడిచాయి. ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను, నా తల్లిదండ్రులకు బాధ కలిగించాను, వారి పేరును చెడగొట్టాను, అరెస్టు అయ్యాను, అందరూ నాకు దూరమయ్యారు. కానీ నేను చాలా ఓర్పుతో ఉన్నాను, ఒక పెద్ద అవకాశం కోసం ఎదురుచూశాను. ఆ అవకాశం లీలా వినోదం రూపంలో నాకు వచ్చింది అని అ నుకుంటున్నాను.” అంటూ షణ్ముఖ్ చెప్పుకొచ్చాడు.