గుజరాత్ తరువాత ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి రిలయన్స్ సంస్థ సిద్ధంగా ఉంది. దాదాపు 65,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. వచ్చే ఐదేళ్లలో ఆంధ్ర ప్రదేశ్ లో 500ల కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్స్ లో రిలయన్స్ ఇన్వెస్ట్ చేయనుంది. రిలియన్స్ క్లీన్ ఎనర్జీ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ఒక్కో బయో గ్యాస్ ప్లాంట్ ఖర్చు 130 కోట్లు అవుతుందని అంచనా . రాష్ట్రంలో గల బంజరు భూముల్లో ఈ బయో గ్యాస్ ప్లాంట్లని డెవలప్ చేయనున్నారు. ఈ పెట్టుబడుల వల్ల దాదాపు 2,50,000ల మందికి ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి లభించనుందని ఏపీ ప్రభుత్వం ఆశిస్తుంది.
ముంబై లో ఓ మీటింగ్ లో ఏపీ ఐ.టీ మినిస్టర్ నారా లోకేష్ మరియు రిలయన్స్ క్లీన్ ఎనర్జీ వ్యవహారాలు చూసుకునే అనంత్ అంబానీ మధ్య ఈ డీల్ కుదిరింది. విజయవాడలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు సమక్షంలో రిలయన్స్ సంస్థ ప్రతినిధులు ఎం.ఓ.యూ మీద సంతకం చేయనున్నారు.