- ఆర్ఆర్ఆర్ తో భారీగా పెరిగిన హీరో రామ్ చరణ్ క్రేజ్
- నెక్స్ట్ మూవీ కోసం రామ్ చరణ్ కు 120 కోట్ల ఫీజ్ చెల్లించిన నిర్మాతలు
- గేమ్ చెంజర్ మూవీకి 90 కోట్ల ఫీజ్
ఆర్ఆర్ఆర్ సినిమా అనంతరం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు క్రేజ్ బాగా పెరిగింది. ప్రస్తుతం హీరో రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీలో నటిస్తున్నాడు. రీసెంట్ గా ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు సనతో రామ్ చరణ్ ఓ మూవీకి సైన్ చేశాడు. రామ్ చరణ్ కు జోడీ గా ఈ మూవీలో జాన్వీ కపూర్ యాక్ట్ చేయబోతుంది. అయితే తాజాగా ఈ సినిమాకి రామ్ చరణ్ ఎంత ఫీజు తీసుకున్నాడనే వార్త వైరల్ అవుతుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు నిర్మాతలు రామ్ చరణ్ కు భారీ మొత్తంలోనే ఫీజు చెల్లించారట.
ఆ న్యూస్ ప్రకారం రాంచరణ్ కు నిర్మాతలు 120 కోట్లు చెల్లించారట. మైత్రి మూవీస్ సంస్థ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే త్వరలో రిలీజ్ కాబోతున్న గేమ్ చేంజర్ మూవీకి కూడా నిర్మాతలు రామ్ చరణ్ కు భారీగానే చెల్లించారు. ఈ మూవీకి కోసం రామ్ చరణ్ కు 90 కోట్లు చెల్లించారట.
ఇక ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీకి గాను 120 కోట్ల పారితోషకం తీసుకోవడంతో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటుల సరసన చేరినట్లయింది. ఈ లిస్ట్ లో సూపర్ స్టార్ రజినీకాంత్, రెబెల్ స్టార్ ప్రభాస్, దళపతి విజయ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారు.
అలాగే బాలీవుడ్ లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటుల్లో త్రి ఖాన్స్ ఉన్నారు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమిర్ ఖాన్ ఉన్నారు.