నవంబర్ 8వ తారీఖు నుండి పార్కులు, జంతు సందర్శనశాలలతో సహా అనేక బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు అనుమతి నిరాకరిస్తుట్లు పాకిస్తాన్ ప్రభుత్వం తెలిపింది. తాజాగా పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.
ఇక పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ కు రాజధాని అయిన లాహోర్ నగరం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా వరసగా ఐదోసారి నిలించింది. వాయు కాలుష్య ప్రభావం తో స్కూళ్లకు సెలవులిచ్చారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రొం హోమ్ ఆదేశాలనిచ్చారు.
ప్రతి ఏడాది దక్షిణ ఆసియా లోని పలు ప్రాంతాలలో చలికాలంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా. పడిపోతాయి. దీంతో గాలిలో దుమ్ము, ఉద్గారాలు లాంటివి ఎక్కువసేపు నిలిచిపోతాయి. అందుకే ఈ సీజన్ లో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. ఇక నిన్న శుక్రవారం రోజు ప్రపంచంలో రెండవ అత్యంత కాలుష్య ప్రదేశంగా దేశ రాజధాని ఢిల్లీ నిలిచింది.