- ఆరేళ్ళ కొడుకుని మొసళ్ళు ఉండే నదిలో పడేసిన కన్నతల్లి
- సగం తినేసిన శరీరాన్ని కనుగొన్న పోలీసులు
- తన భర్త వేధింపులు తట్టుకోలేకే ఈ పని చేసానని ఒప్పుకున్న మహిళ
- భర్త, భార్య అరెస్ట్
కర్ణాటకలో ఓ మహిళ తన ఆరేళ్ళ కొడుకుని మొసళ్ళు ఉండే నదిలో పడవేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తతో గొడవ పడిన ఆ మహిళ, దివ్యాంగుడైన తన కొడుకుని మొసళ్ళు తిరిగే నదిలో పడేసింది.ఆ మరుసటి నాడు సగం తినేసిన శరీరాన్ని కనుగొన్నామని కర్ణాటక పోలీసులు తెలిపారు.
ఇళ్లలో పనిచేసుకునే 32 ఏళ్ల సావిత్రి తరచూ చెవిటి, మూగవాడైన తన ఆరేళ్ళ కొడుకు గురించి తన భర్త రవి కుమార్ తో నిత్యం గొడవ పడుతుండేదని సమాచారం. వీరికి 2 ఏళ్ల కొడుకు కూడ ఉన్నట్లు ఉన్నాడు.
దివ్యాంగుడైన తన కొడుకుని కాలువలో పడేయమని నా భర్త నన్ను నిత్యం టార్చర్ చేసేవాడని సావిత్రి పోలీసులకు తెలియజేసింది. “దీనికి నా భర్తే కారణం. ఎప్పుడూ తినడం తప్ప నీ కొడుకు ఏమి చేస్తాడు అంటూ నన్ను చంపుకు తినేవాడు. నా భర్త రోజూ అలా అంటుంటే నేను ఎంత అని భరించగలను, ఎవరితో చెప్పుకోను” అని మహిళ అంది.
ఎప్పటి లాగానే శనివారం కూడా గొడవ జరగడంతో సావిత్రి తన కొడుకుని మొసళ్ళు ఎక్కువగా ఉండే ఉత్తర కర్ణాటక జిల్లాల్లో గల నదిలో పడేసింది.
ఈ దృశ్యాన్ని గమనించిన కొంత మంది స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు రాత్రంతా ఆ ప్రాంతాన్ని గాలించారు. అయితే మరుసటి రోజు ఉదయం ఆ బాలుడి శవం పోలీసులకు లభించింది.ఒళ్ళంతా కరిచిన గుర్తులు. కుడి చెయ్యి తినేసి ఉండడంతో మొసళ్ళు చంపేసి ఉంటాయని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు.
భర్త రవి కుమార్ మరియు భార్య సావిత్రిలపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.