ఇతడి పేరు గణేష్ బరయ్యా, ప్రపంచంలోనే అత్యంత పొట్టి డాక్టర్ గా ఇతడు రికార్డుల్లోకి ఎక్కాడు. ఇతని ఎత్తు 3 అడుగుల నాలుగు అంగుళాలు. చిన్నతనంలోనే ఎదుగుదల లోపం కారణంగా అంతకు మించి ఎత్తు పెరగలేక పోయాడు. గణేష్ తన హైట్ కారణంగా అనేక అవమానాలు పడ్డాడు, అనేక సవాళ్ళను ఎదురొన్నాడు. కానీ డాక్టర్ అవ్వాలనే కోరిక వీటన్నిటినీ ఎదుర్కొనేలా చేసింది. ప్రస్తుతం డాక్టర్ గా సేవలందిస్తూ ప్రశంసలు పొందుతున్నాడు.
ఇక స్టోరీ లోకి వెళ్తే 2018 లో గణేష్ కి ఎం.బి.బి.స్ సీటు ఇవ్వడానికి గుజరాత్ ప్రభుత్వం నిరాకరించింది. బోర్డ్ ఎక్సామ్స్ లో 87 శాతం మార్కులు , నీట్ లో 233 మార్కులు సాధించినా, తన ఎత్తు ని కారణంగా చూపెడుతూ ఎంబీబీస్ సీటు ఇవ్వటానికి ప్రభుత్వం ఒప్పుకోలేదు.
ఆ తరువాత గణేష్ , తన స్కూల్ ప్రిన్సిపాల్ సాయం తో కలెక్టర్ ని కలిసాడు. విద్యామంత్రిని కూడా కలిసాడు అయినా లాభం లేక పోయింది. అటు గుజరాత్ హై కోర్టు గడప తొక్కినా, కేసును కొట్టివేయడంతో అక్కడా చుక్కెదురైయ్యింది.
ఎలా అయినా ఎంబీబీస్ చదవాలనే తపన ఉండడం వల్ల అతను వెనకకు తగ్గలేదు. ఇక చివరి అస్త్రంగా అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. తన కేసుని పరిశీలించిన కోర్టు, గణేష్ ఎం.బీ.బి.స్ పూర్తి చెయ్యొచ్చని తేల్చిచెప్పడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
ఇక తీర్పు తనకి అనుకూలంగా రావడంతో 2019లో బావ్ నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో జాయిన్ అయి, తన ఎం.బీ.బి.స్ ప్రయాణాన్ని ఆరంభించాడు.
ఇప్పుడు గణేష్ బరయ్యా , మెడికల్ కాలేజ్ కి వచ్చే పేషంట్లకు ట్రీట్మెంట్ చేస్తున్నాడు. వైద్య రంగంలో తనకు ఉన్న అనుభవంతో పేషంట్లకు ట్రీట్మెంట్ చేస్తూ, వారి మన్ననలు పొందుతున్నాడు ఈ మరుగుజ్జు డాక్టరు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటిని అధిగమించి, అనుకున్నది సాధించవచ్చని గణేష్ నిరూపించి, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు.