మొన్నామధ్య మహబూబ్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి చికెన్ తింటూఉండగా గొంతులో ఎముక ఇరుక్కుని ఊపిరాడక మృతి చెందిన ఘటన మరువక ముందే తాజాగా, సకినం తింటూ ఉండగా గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి మృతిచెందాడు.
వివరాల్లోకి వెళ్తే మంచిర్యాలలో నివసించే 65 ఏళ్ల రంగారావు రాత్రి భోజనం చేస్తూ ఉండగా సకినం గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు దగ్గర్లోని ఓ ఆసుపత్రికి తరలించగా అప్పటికే రంగారావు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
అయితే కుటుంభ పెద్దని కోల్పోవడంతో రంగారావు కుటుంభ సభ్యులు అతని మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.
Also Read అంబానీకి చెందిన మాల్ లో 41 సూపర్ లగ్జరీ కార్లను సీజ్ చేసిన ముంబై పోలీసులు, ఎందుకో తెలుసా?