కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ తాజా చిత్రం అమరన్ తో తన కెరీర్‌లోనే బెస్ట్ హిట్ అందుకున్నాడు. భారత సైన్యంలో పనిచేసే మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ బయోపిక్ ప్రేక్షకులను మరియు విమర్శకులను బాగా ఆకట్టుకుంది. శివకార్తికేయన్ , సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆదివారం నాటికి బాక్సాఫీస్ వద్ద రూ. 235 కోట్ల వసూళ్లను రాబట్టి శివకార్తికేయన్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.
అమరన్ సినిమా కొన్ని రోజుల్లో రూ. 250 కోట్ల క్లబ్‌లో చేరేందుకు సిద్ధంగా ఉండడంతో, శివకార్తికేయన్ తమిళ సినిమా చరిత్రలో అరుదైన ఘనత సాధించబోతున్నాడు. ఈ ఘనత ఆయనను తమిళ చిత్ర పరిశ్రమలో రాజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ లాంటి ప్రముఖు హీరోల సరసన నిలబెట్టనుంది.
ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పేరియసామి దర్శకత్వం వహించారు. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్, వివేక్ కృష్ణన్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. జివి ప్రకాష్ కుమార్ స్వరపరచిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ మూవీ లో మేజర్ వరదరాజన్ రోల్ చేసిన శివకార్తికేయన్, ఆ క్యారెక్టర్ లో జీవించేసాడు. మేజర్ వరదరాజన్ కధ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వడంతో, పెద్ద సంఖ్యలో వచ్చి మూవీ ని హిట్ చేశారు.
అమరన్ రాబోయే రోజుల్లో రూ. 275 కోట్లు దాటే అవకాశముంది, ఇక ఈ మూవీ 300 కోట్లు వసూలు చేస్తుందా లేదా అనేది హీరో సూర్య నటించిన కంగువ మూవీ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ పై ఆధారపడి ఉంది.