సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట లో ఓ మహిళ ప్రాణం కోల్పోయిన ఘటనలో శుక్రవారం మధ్యాహ్నం హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ నిన్న ఉదయం జైలు నుండి విడుదల అయ్యారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అయ్యారు.
శుక్రవారం రోజు ఈ కేసు విషయంలో తెలంగాణ హైకోర్టు వెంటనే తాత్కాలిక బెయిల్ మంజూరు చేసినా, డాక్యూమెంట్లు ఆన్లైన్ లో అప్లోడ్ అవ్వడం జాప్యం కావడం తో రాత్రి చంచల్ గూడా జైలు లోనే అల్లు అర్జున్ గడపాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో, అల్లు అర్జున్ కి బెయిల్ ఇంత ఫాస్ట్ గా రావడానికి కారణం అయిన లాయర్ పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఆ లాయర్ పేరే నిరంజన్ రెడ్డి.
ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కూడా కావడం విశేషం. ఈ కేసులో అల్లు అర్జున్ తరఫున వాదనలు వినిపించారు. అలాగే, ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి వ్యక్తిగత న్యాయవాదిగా కూడా వ్యవహరిస్తున్నారు.
మొన్న శుక్రవారం నాడు నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధించడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే, నిరంజన్ రెడ్డి తన వైపు వాదనలు బలంగా వినిపించి హైకోర్టులో అల్లు అర్జున్‌కు అనుకూలంగా తీర్పు రావడంలో దోహదపడ్డారు.
అయితే నిరంజన్ రెడ్డి కోర్టు వాదనలకు గంటకు సుమారు రూ. 5 లక్షల ఫీజు వసూలు చేస్తారని సమాచారం. ఈ కేసులో ఆయన తీసుకున్న శ్రద్ధ కి ఈ ఫీజు పూర్తిగా సమంజసమే అని సోషల్ మీడియాలో పలువురు అభిప్రాయపడుతున్నారు.