ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు మరియు ఐటీ ప్రొఫెషనల్ వెంకట దత్త సాయి ఈ డిసెంబర్ 22న ఉదయపూర్‌లో వివాహ బంధంతో ఒక్కటవనున్నారు. ఈ వివరాలను సింధు తండ్రి పీవీ రమణ వెల్లడించారు. డిసెంబర్ 24న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు.
బ్యాడ్మింటన్‌లో సింధు విజయగాథ ప్రపంచానికి తెలిసినప్పటికీ, ఆమె అక్క పీవీ దివ్య గురించి చాలా మందికి తెలియదు. సింధు కన్నా ఏడు సంవత్సరాలు పెద్దదైన దివ్య ఒకప్పుడు నేషనల్ లెవెల్ హ్యాండ్‌బాల్ ప్లేయర్‌గా తన సత్తా చాటింది. అయితే తర్వాత ఆమె వైద్య విద్యను ఎంచుకుని డాక్టర్‌గా స్థిరపడింది. 2012లో దివ్య వివాహం జరుగుతున్న వేళ సింధు సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ గ్రాండ్ ప్రిలో ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న కారణంగా తన సోదరి పెళ్లికి హాజరుకాలేకపోయింది. ఆ సందర్భంలో సింధు “ఈ మ్యాచ్ గెలిచి మా అక్క దివ్యకు బహుమతిగా ఇవ్వాలని అనుకున్నాను,” అని పేర్కొన్నారు. అయితే ఆ మ్యాచ్‌ను కొద్ది తేడా తో ఓటమి పాలయ్యింది.
సింధు మరియు దివ్య తమ కెరీర్ లో వేర్వేరు మార్గాలను ఎంచుకున్నప్పటికీ, వారిద్దరి మధ్య అద్భుతమైన బాండింగ్ ఉంది. సింధు తరచుగా తన సోదరి, కుటుంబ సభ్యులతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. సింధు చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, “చిన్నప్పుడు నేను బ్యాడ్మింటన్ ఆడుతానంటే నువ్వు ఇంకా చిన్నపిల్లవే అంటూ నన్ను ఆడనిచ్చేవారు కాదు . ఇప్పుడు ఆ విషయాన్ని తలుచుకుంటే నవ్వొస్తుంది” అని ఓ సందర్భంలో పీ.వీ సింధు అన్నారు.
సింధు తల్లిదండ్రులు జాతీయ స్థాయి వాలీబాల్ ఆటగాళ్లు. దీన్నీ బట్టి చెప్పొచ్చు వాళ్ళ ఫ్యామిలీకి స్పోర్ట్స్ అంటే ఎంత ఆశక్తో. ఇక సింధు తండ్రి గారైన పీవీ రమణ 1986 సియోల్ ఏషియన్ గేమ్స్ . ఇప్పుడు సింధు వివాహ వేడుకల కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.