ప్రముఖ రాజకీయ నాయకులపై సోషల్ మీడియాలో కించపరిచేలా పోస్టులు పెట్టారు అనె ఆరోపణలపై ప్రకాశం జిల్లా పోలీసులు దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు
నోటీసులు జారీ చేశారు. ప్రకాశం జిల్లా మడ్డిపాడు పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్.ఐ శివరామయ్య నేతృత్వంలోని బృందం బుధవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో వర్మ నివాసానికి చేరుకుని నోటీసులు అందజేసింది.
తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎం. రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. 2024 ఎలక్షన్ ల ముందు రామ్‌గోపాల్‌వర్మ తన చిత్రం “వ్యూహం” ప్రచారం చేస్తున్నపుడు మాజీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబం, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టిడిపి నాయకుడు నారా లోకేష్‌లపై విమర్శలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పోస్టులు ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా పెట్టినవని తెలియజేశారు.
ఇక మరొక ఫిర్యాదు గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. రామ్‌గోపాల్‌వర్మ చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌ల పోటోలను మార్ఫ్ చేసిన అసభ్యకరమైన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు ఆరోపించారు.