వేదం, గమ్యం, కంచె, లాంటి వైవిధ్యభరితమైన చిత్రాలకు పేరొందిన ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ కు చెందిన ప్రసిద్ధ డాక్టర్ డాక్టర్ ప్రీతి చల్లాని టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ వివాహం చేసుకోనున్నారు. ఈ నెలలో ఎంగేజ్మెంట్, వచ్చే నెలలో వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది . ఈ వేడుకకు బంధువులతో పాటు సీనీ రంగానికి చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు.
ఇరువురికి ఇది రెండవ వివాహం కావడం గమనార్హం. డాక్టర్ ప్రీతి చల్లా హైదరాబాద్ లోని చల్లా హాస్పిటల్స్‌లో గైనకాలజిస్ట్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్టుగా పని చేస్తోంది. ఇదిలా ఉండగా, క్రిష్ గతంలో డాక్టర్ రమ్యాను వివాహం చేసుకున్నారు. తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. 2018లో వీరికి విడాకులు మంజూరు అయ్యాయి.
ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ తన తాజా చిత్రం ఘాటి పై పూర్తిగాఫోకస్ పెట్టారు. లేడి సూపర్ స్టార్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం టీజర్ ఇటీవలే రీలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది.