తమిళనాడులో పీచు మిఠాయి అమ్మకాలపై నిషేధం!

Cotton Candy Ban in Tamilnadu

తమిళనాడు ప్రజలు ఇప్పుడు పీచు మిఠాయిని ఇష్టంగా తినాలన్న తినలేరు. ఎందుకంటే పీచు మిఠాయి తయారీదారులు, అందులో రోడమిన్-బి అనే పదార్ధం కలుపుతున్నట్లు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులకి తెలిసింది.  ఫుడ్ ఎనాలిసిస్ డిపార్ట్మెంట్ వారు కొన్ని శాంపిల్స్ సేకరించి పరీక్షించి చూడగా ఇది నిజమని తేలింది.

రోడమిన్-బి పదార్ధాన్ని టెక్స్టైల్ డై లో వాడుతారు., ఇది ఓ కెమికల్ అని, కలిపిన పదార్ధాల్ని తింటే ఆరోగ్యం పాడవుతుందని, కాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని , అందుకే పీచు మిఠాయి విక్రయాల్ని నిషేధించినట్లు తమిళనాడు హెల్త్ మినిస్టర్ ఎం.ఏ. సుబ్రమణియన్ తెలిపారు.

ఇక నుండి ఎవరైనా ఈ కెమికల్ పదార్ధం కలిపిన ఆహార ఉత్పత్తుల్ని తయారుచేసినా,అమ్మినా,ప్యాకింగ్ చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుని కఠినంగా శిక్షిస్తామని  ఆయన తెలిపారు.

ఇప్పటికే పాండిచ్చేరి లో పీచు మిఠాయి నిషేధం ఉంది. తాజాగా ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో కూడా నిషేధించడంతో పీచు మిఠాయి అమ్ముకుని జీవనం సాగించేవాళ్ళు,  తయారీదారులు తమ జీవనోపాధిని కోల్పోనున్నారు.

By viralkaburlu.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

No widgets found. Go to Widget page and add the widget in Offcanvas Sidebar Widget Area.