తమిళ్ సినిమాలో విజయ్ సేతుపతి హీరో గా నటించిన మహారాజా మూవీ ఓ కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. అటు తెలుగు లో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. అదే కాకుండా ఈ సినిమా విజయ్ సేతుపతికి 50వ సినిమా కావడం విశేషం.
అయితే రీసెంట్ గా ఈ మూవీ థియేటర్లలో 100 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది ఈ సందర్బంగా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ నితిలన్ స్వామినాధన్ కు బి.ఎమ్.డబ్ల్యు కారును గిఫ్ట్ గా ఇచ్చారు. డైరెక్టర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోవడంతో ఇప్పుడు ఈ ఫోటోలు ఆన్లైన్ లో వైరల్ గా మారాయి .
ఇక విజయ్ సేతుపతి నటించిన ఈ మూవీ రీమేక్ హక్కులు సొంతం చేసుకోవడానికి కొన్ని ప్రొడక్షన్ కంపెనీలు పోటీ పడుతున్నాయని సమాచారం.
ప్రస్తుతం అత్యధికంగా పారితోషకం తీసుకుంటున్న నటులలో విజయ్ సేతుపతి ఒకరు. ప్రతినాయకుడి పాత్రలు, వైవిధ్యభరితమైన పాత్రలు ఎంచుకుంటారు. ఇక బాలీవుడ్ లో షారుక్ ఖాన్ జావన్ మూవీ లో విజయ్ సేతుపతి నటించారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో బాలీవుడ్ నుండి విజయ్ సేతుపతి కి ఆఫర్స్ వస్తున్నాయ్.