శ్రీశైల క్షేత్రంలో శుక్రవారం నాడు ఓ భక్తుడు ప్రసాదం తింటూ ఉండగా చికెన్ ఎముక రావడంతో కలకలం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ ప్రాంతానికి చెందిన హరీష్ రెడ్డి, శివయ్యను దర్శించుకోవడానికి శ్రీశైలం వచ్చాడు. దర్శించుకున్న తరువాత నోటికి ఎదో గట్టిగా తగిలనట్టు అనిపించింది,. తీరా ప్యాకెట్ లో చూడగా రెండు చికెన్ ఎముకులు కనిపించాయి.
దీంతో ఆగ్రహానికి గురైన హరీష్ రెడ్డి ఆలయ A.E.O కు లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాడు. దర్శనానికి వచ్చిన భక్తులు సైతం ఆలయ అధికారుల ఉదాసీనతపై మండిపడ్డారు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యంత భక్తి శ్రధ్ధలతో కొలిచే ఆ శ్రీశైల క్షేత్రంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం అని, పలువురు భక్తులు పెదవి విరుస్తున్నారు.
నిత్యం వేలాది మందితో కిటికిటలాడే ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఆలయ పరిసరాలు పవిత్రంగా, పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటిది, ఇటువంటి ఘటన చోటు చేసుకోవడంతో భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భక్తులు ఆలయ అధికారులను కోరుతున్నారు.