08
Nov
టీజీఎస్ఆర్‌టీసీ, ఇకపై జీ.హెచ్.ఎం.సి పరిధిలో హోం డెలివరీ సదుపాయం అందించనుంది. పైలట్ ప్రాజెక్ట్ గా గత నెల 31 న హోం డెలివరీ సర్వీసులను టీజీఎస్ఆర్‌టీసీ లాంచ్ చేసింది. ఎం.జీ.బీ.ఎస్, సీబీఎస్, దిల్‍సుఖ్‍నగర్, జె.బీ.ఎస్, కె.పీ.హెచ్. బీ, ఉప్పల్, రాణిగంజ్, కుషాయిగుడా, జీడిమెట్ల, సంతోష్ నగర్, ఆటోనగర్, చర్లపల్లి, మేడిపల్లి, ఎస్. నగర్ ప్రాంతాలకు ఈ సదుపాయం ఉంది. భవిష్యత్తులో మరిన్ని జిల్లాలకు ఈ సదుపాయాన్ని విస్తరించనున్నారు. టీజీఎస్ఆర్‌టీసీ లాజిస్టిక్ సెంటర్స్ వద్ద డెలివరీ ఏజెంట్లు ఈ పార్సిళ్లు కలెక్ట్ చేసుకుంటారని, కలెక్ట్ చేసుకున్న పార్సిళ్లను నిర్ణీత అడ్రెస్ లకు డెలివరీ ఏజెంట్లు డోర్ డెలివరీ చేస్తారని ఆర్.టి.సి అధికారులు తెలిపారు. కావున ప్రజలందరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అధికారులు తెలిపారు. తద్వారా టీజీఎస్ఆర్‌టీసీ లాజిస్టిక్స్ విభాగం మరింత బలపడుతుందని వారన్నారు. రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి 1 కేజీ వరకు: ₹50 1.01 నుండి 5 kg:…