హర్యానా లో బీజేపీ పార్టీ ఎక్సిట్ పోల్స్ అంచనాలు తలకిందులు చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు 46 సీట్లు కావాల్సి ఉండగా, 48 సీట్లు సాధించి వరుసగా మూడోసారి విజయం సాధించింది. అయితే ఈ సందర్బంగా ఢిల్లీలోని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇంటికి ఓ బాక్స్ జిలేబీ పంపింది. అసలు జీజేపీ పార్టీ ఎందుకు ఈ పని చేసిందో తెలుసుకుందాం.
అసలు ఈ జిలేబీ గోల ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యిందంటే మొన్నామధ్య హర్యానా లోని గొహానా ఎలక్షన్ ర్యాలీలో మటు రామ్ హల్వాయి జిలేబీ అనే స్వీట్ షాప్ పై రాహుల్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి జిలేబీలు దేశవ్యాప్తంగా ఫ్యాక్టరీలలో తయారు చేయించాలి, తద్వారా దేశంలో ఏంతో మందికి ఉపాధి లభిస్తుంది అని రాహుల్ గాంధీ అన్నారు.
అయితే వెంటనే కొంతమంది నెటిజన్లు రాహుల్ కామెంట్స్ ని మీమ్స్ చేయడం స్టార్ట్ చేశారు. జిలేబీలను ఫ్రెష్ గా వేడి వేడిగా తినాలి కానీ, ఫ్యాక్టరీలలో తయారు చేయడం ఏంటి అంటూ కొంత మంది ట్రోల్ చేశారు.
ఇక హర్యానా బీజేపీ రాహుల్ గాంధీకి ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన 1 కేజీ జిలేబీ స్క్రీన్ షాట్ తీసి తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.