- వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లు విడిపోతారు: వెణుస్వామి
- టైం పట్టొచ్చు కానీ విడిపోవడం ఖాయం
- ఇద్దరి జాతకాల్లో పెళ్లి యోగ్యం లేదు
- పెళ్లి చేసుకున్నారంటే మిరాకిల్ అని చెప్పాలి!
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మ్యారేజ్ అయ్యి దాదాపు ఆరు నెలలు కావొస్తుంది. పోయిన ఏడాది నవంబర్ ఒకటిన ఫ్రెండ్స్ మరియు ఫామిలీ మెంబెర్స్ సమక్షంలో ఇటలీలో వీళ్లిద్దరి మ్యారేజ్ జరిగింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు 2016లో వచ్చిన “మిస్టర్” మూవీ సెట్స్ లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఇరువైపులా పెద్దలను ఒప్పించి గత ఏడాదే ఈ ప్రేమ జంట ఒక్కటయ్యారు.
ఇదిలా ఉండగా ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి, ఈ దంపతుల పెళ్లి జీవితంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ త్వరలో విడిపోబోతున్నారు అంటూ ఈ సెలెబ్రిటీ జ్యోతిష్కుడు చెప్పుకొచ్చారు.
ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఇలా చెప్పుకొచ్చారు. ఈ జంట మీద వ్యక్తిగతంగా నాకు ఎలాంటి కక్ష ఏమిలేదు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల జాతకం ప్రకారం పెళ్లి యోగం లేదని వేణుస్వామి అన్నారు. కానీ వీరు పెళ్లి చేసుకున్నారంటే అది మిరాకిల్ అనే చెప్పాలి. ఎందుకంటే వీరి జాతకంలో గురుడు, శుక్రుడు నీచ స్థితిలో ఉన్నారు. వారు కలిసుండే అవకాశం లేదని అన్నారు.
నేను ఇలా చెబుతున్నానని నామీద బ్యాడ్ కామెంట్స్ చెయ్యొచ్చు. ఓ వ్యక్తి జోక్యం చేసుకోవడం వల్ల వారిద్దరూ విడిపోతారు. నేను వారి జాతాకాలు చూసే చెబుతున్నాను విడిపోవడం ఆలస్యం కావచ్చు కానీ, ఫ్యూచర్ లో విడిపోతారు అంటూ వేణుస్వామి చెప్పుకొచ్చారు.