ఏ.పీ లో క్రీడలను ప్రమోట్ చేయడానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్రికెటర్ అవతారం ఎత్తారు. తన సొంత నియోజకవర్గం అయిన పిఠాపురంలో స్పోర్ట్స్ కిట్లను ను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 32 ప్రైమరీ స్కూళ్లకు ఈ స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేస్తారని తెలుస్తుంది. అంతకు ముందు తన క్యాంపు ఆఫీస్ లో పంపీణీ చేయనున్న క్రికెట్ బ్యాట్స్, వాలీబాల్ తదితర స్పోర్ట్స్ కిట్లను పవన్ కళ్యాణ్ పరిశీలించారు.
ప్రతి స్కూల్ కి 2 కిట్లు ఇవ్వనున్నారు. 1 కిట్ ధర వచ్చేసి 25,000 ఉంటుంది. మొత్తం కిట్ల విలువ 16 లక్షల వరకు ఉంటుందని సమాచారం. CSR స్కీం అనగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పధకం కింద ఈ నిధులను సమీకరించనున్నారు . స్పోర్ట్స్ కిట్ల పంపిణీని కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ దగ్గర ఉండి పర్యవేక్షిస్తారు. విద్యార్ధులను క్రీడల్లో ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం చేపట్టాలని ఏపీ డిప్యూటీ సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.