ప్రముఖ నటుడు సిద్దార్థ్ తాజాగా పుష్ప 2 మూవీ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సిద్దార్థ్, పాట్నా లో జరిగిన పుష్ప-2 ప్రమోషన్ ఈవెంట్ కి సంబంధించి నోరు జారాడు. ఈ ఈవెంట్ కి వచ్చిన జనాన్ని కంపేర్ చేస్తూ, ఓ జేసీబీ వచ్చినా జనం ఎగబడి చూస్తారు అంటూ కామెంట్ చేశాడు.
అయితే ఈ వ్యాఖ్యలపై పుష్ప-2 టైటిల్ సాంగ్ సింగర్ మికా సింగ్ తీవ్రంగా స్పందించారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాశారు “హలో సిద్దార్థ్ భాయ్, నీ వ్యాఖ్యల వల్ల ఒక మంచి జరిగింది అది ఏమిటంటే, ఈ రోజు నుండి కొంతమంది నీ పేరును తెలుసుకుంటున్నారు, అసలు ఇప్పటి వరకు నువ్వు ఎవరివో కూడా నాకు తెలియదు”
సిద్దార్థ్ సదరు ఇంటర్వ్యూలో, పట్నాకి వచ్చిన జనసమూహాన్ని ఓ “జిమ్మిక్” అని కొట్టిపారేశారు. “మన దేశంలో జేసీబీ తవ్వుతుంటే చాలు జనాలు ఎగబడి మరీ చూస్తారు. అలా చూస్తే బీహార్లో అల్లు అర్జున్ను చూడడానికి జనాలు వచ్చారంటే అందులో ఆశ్చర్యం ఏముంది? జనసమూహాలు క్వాలిటీని సూచించవు. అదే నిజమైతే, అన్ని రాజకీయ పార్టీలు గెలవాలి. జనం ఓ బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ బాటిల్ కోసం వస్తారు. అంటూ సిద్దార్ద్ కామెంట్ చేసాడు”
సిద్దార్థ్ , పుష్ప 2 గురించి మాట్లాడడం ఇదేమి మొదటిసారి కాదు. కొద్ది రోజుల ముందు తన నెక్స్ట్ మూవీ మిస్ యూ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వూ లో యాంకర్ “పుష్ప 2 లాంటి పెద్ద బడ్జెట్ సినిమా రీలీజ్ అవుతుంది, ఓ వారం తరువాత మీ సినిమా లీజ్ అవుతుంది మీకు ఆందోళనగా లేదా అని అడిగితె, దానికి సిద్దార్ద్, వారు ఆందోళన చెందాలి కానీ నేను భయపడను అంటూ సమాధానం ఇచ్చాడు.
అయితే అల్లు అర్జున్ అభిమానులు, సిద్దార్థ్ వ్యాఖ్యలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.