ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగింది. అదే విధంగా సోషల్ మీడియా యూజర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఇక ఆన్లైన్ లో తమ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుఎన్సర్ లు బాగానే కష్టపడతారు. కొంత మంది ప్రోడక్ట్ మార్కెటింగ్ ద్వారా డబ్బు కూడా సంపాదిస్తుంటారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే అమ్మాయి ఈ కోవకి చెందిందే.
వివరాల్లోకి వెళ్తే చైనా లో నివసిస్తున్న ఈ అమ్మాయి పేరు zheng xiang xiang,. లైవ్ స్ట్రీమ్ ద్వారా ఆన్లైన్ లో వస్తువుల్ని అమ్ముతుంది. ఈమెకి టిక్ టాక్ లో 1 మిలియన్ కంటే ఎక్కువ followers ఉండటంతో మూడంటే మూడు సెకండ్లలో ఓ వస్తువుని అమ్మేస్తుంది. ఒక్క ఐటమ్ కాదు వెలకద్ది వస్తువులను చిటికెలో అమ్మేస్తుంది. రెగ్యులర్ గా వేసుకునే బట్టల నుండి , ఎలక్ట్రానిక్ వస్తువులు, చీపుర్లు, బ్యాగులు ఇలా ఏదైనా ఈ మహిళ అమ్మేస్తుందట. జనం ఎగబడి మరీ కొంటుండటంతో ఒక్క వారంలో నే 120 కోట్లు పైగా సంపాదిస్తుందట.
ఓ ప్రాడక్ట్ ని అమ్మాలంటే మార్కెటింగ్ చేసేవాళ్ళు గంటలు గంటలు explain చేస్తూ తెగ కష్టపడిపోతుంటారు. ఈమె ఆలా కాదు ఏదైనా ఒక వస్తువును లైవ్లో మూడు సెకండ్లపాటే చూపిస్తుంది. ఇక ఆ ప్రోడక్ట్ గనుక ఓ వ్యక్తికి నచ్చితే, ఆ మూడు సెకండ్లలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అది అయిపోగానే మళ్ళి నెక్స్ట్ ప్రోడక్ట్ చుపించడం మొదలుపెడుతుంది.
ఇక ఆ ప్రోడక్ట్ నచ్చి కొనుక్కునేవారు ఒక డెసిషన్ కి రాక తప్పదు. సో అలా ఆన్లైన్ లో వస్తువులను తెగ అమ్మేస్తుందట ఈ మహిళ. ఇంత ఫాస్ట్ గా ఎలా అమ్మేస్తుంది అని అక్కడి మార్కెటింగ్ కంపెనీలు సైతం ఆశ్చర్యపోతున్నాయంట.