సెప్టెంబర్ 1 2024 న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇప్పుడు తుది దశకు చేరుకుంది. నిన్నటితో ఈ షో 15వ వారంలోకి అడుగు పెట్టింది. డిసెంబర్ 15న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ షో దాదాపు ముగింపు దశలో ఉన్న నేపథ్యంలో, 14వ వారంలో ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు.
డిసెంబర్ 7న శనివారం నాడు రోహిణీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లగా. ఆ మరుసటి రోజే, యాంకర్ విష్ణుప్రియ కూడా ఎలిమినేట్ అయ్యింది. ఇద్దరు కాంటెస్టెంట్లు తమ ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
12వ కాంటెస్టెంట్‌గా షోలో అడుగుపెట్టిన విష్ణుప్రియ, దాదాపు 3 నెలలుగా బిగ్ బాస్ హౌస్‌లో ఉంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు విష్ణుప్రియా ఎంత పారితోషకం తీసుకుందో చాలా మంది ప్రేక్షకులకి తెలుసుకోవాలని ఉంటుంది. అయితే విష్ణుప్రియ రోజుకు ₹57,142 పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అంటే వారానికి సుమారు ₹4 లక్షలు ఉంటుంది. మూడు నెలల వ్యవధిలో సుమారు ₹57 లక్షలు సంపాదించి ఉంటుంది అని తెలుస్తుంది.
అయితే ఈ పారితోషకం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీ ₹50 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉండటం విశేషం.