పుష్ప 2: విడుదలైన మొదటి రోజే అద్భుతమైన కలెక్షన్లతో రికార్డులు సృష్టించింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 10,000కి పైగా స్క్రీన్లలో విడుదల చేశారు.
ప్రీమియర్ షోలతో సహా భారతదేశంలో ₹175.1 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. ఇది ఇప్పటివరకు భారతీయ సినీ చరిత్రలోనే భారీ ఓపెనింగ్. విడుదలకు ముందే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరులో ప్రత్యేక ప్రీమియర్ షోల ద్వారా ₹10.1 కోట్లు నెట్ వసూలు పుష్ప-2 చేసింది.
ఇతర దేశాల్లోని కలెక్షన్లతో కలిపి, సినిమా మొదటి రోజు మొత్తం ₹200 కోట్లు గ్రాస్ కలెక్షన్ సాధించినట్లు అంచనా వేస్తున్నారు.
ఇక షారుఖ్ ఖాన్ జవాన్ ను బీట్ చేసి హిందీ లో కూడా అత్యంత భారీ ఓపెనింగ్ సాధించిన సినిమాగా పుష్ప 2 రెకార్డ్ సృష్టించింది. అంతేకాక, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR మొదటి రోజు కలెక్షన్ అయిన ₹223 కోట్లు కూడా దాటే అవకాశం ఉంది.
సో పుష్ప 2 విడుదలైన మొదటి రోజే సరికొత్త రికార్డులను సృష్టించి భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది!