బంగ్లాదేశ్ రోగులను మా ఆసుపత్రిలో చేర్చుకోము!

A Hospital named JN Ray in Kolkata says we wont admit Bangladeshi Patients

కోల్‌కతా నగరంలో మనిక్తల ప్రాంతంలోని జె.న్ రే ఆసుపత్రి బంగ్లాదేశీ రోగులకు ఇకపై చికిత్స అందించబోమని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులు మరియు భారత త్రివర్ణ పతాకాన్ని అవమానించిన తీరు మమ్మల్ని భాద పెట్టింది అని ఆసుపత్రికి చెందిన ఓ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో మేము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ అధికారి తెలిపారు.

ప్రెస్ తో మాట్లాడిన ఆసుపత్రి అధికారిక ప్రతినిధి సుభ్రాంశు భక్త్ , “ఈరోజు నుండి మేము బంగ్లాదేశీ రోగులను మా ఆసుపత్రిలో జాయిన్ చేసుకోకూడదని నిర్ణయించుకున్నాం. ప్రధానంగా బంగ్లాదేశీ పౌరులు భారత్ జెండా ను అవమానించిన తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

కోల్‌కతా లోని ఇతర ఆసుపత్రులు కూడా తమకు మద్దతు నిలిచి , బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఇలాంటి చర్యలు తీసుకోవాలని జె. ఎన్ఆ. రే ఆసుపత్రి మ్యానేజ్మెంట్ కోరింది.

“బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటంలో భారత్ కీలక పాత్ర పోషించింది. అయినప్పటికీ ఇంకా భారతదేశం పట్ల వ్యతిరేకతను మనం చూస్తున్నాం. త్రివర్ణ పతాకాన్ని అవమానించడాన్ని చూసిన తర్వాత, ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అనిపించింది. మిగతా ఆసుపత్రులు కూడా మాకు మద్దతుగా ముందుకు రావాలని ఆశిస్తున్నాం,” అని భక్త్ తెలిపారు.

By viralkaburlu.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

No widgets found. Go to Widget page and add the widget in Offcanvas Sidebar Widget Area.