స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించి భారీ అంచనాల నడుమ పుష్ప 2: ది రూల్ వచ్చే గురువారం విడుదల కానుంది. అభిమానులు, సినిమా ప్రముఖులు ఈ సినిమా అనేక బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొడుతుందో లేదో అని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు, మరీ ముఖ్యంగా హిందీ మార్కెట్లో పుష్ప – 2 కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
పుష్ప ఫస్ట్ పార్ట్ భారీ విజయాన్ని సాధించగా, సెకండ్ పార్ట్ అంతకు మించి కలెక్షన్స్ సాధిస్తుందని భావిస్తున్నారు. పుష్పకి నార్త్ లో భారీ క్రేజ్ ఉంది. దాంతో అందరి చూపు హిందీ వెర్షన్ లో పుష్ప – 2 ఎంత కలెక్ట్ చేస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక పుష్ప 2 అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ రేపటి నుండి ప్రారంభం కానుంది. విడుదలకు ముందు రికార్డ్ స్థాయి టికెట్ సేల్స్ నమోదు అవుతాయని మూవీ టీమ్ భావిస్తుంది.ప్రస్తుతం, హిందీ సినిమాల ఓపెనింగ్ వీకెండ్ లో అత్యధిక ప్రీ-సేల్స్ ₹55.50 కోట్లతో షారుక్ ఖాన్ జవాన్ ముందుంది ఉంది. దక్షిణాది చిత్రాల హిందీ డబ్ వెర్షన్లలో, కేజీఎఫ్ చాప్టర్ 2 ₹42.50 కోట్లతో ముందంజలో ఉంది.
పుష్ప 2 ఈ సంఖ్యను సులభంగా దాటుతుందని, జవాన్ రికార్డు కూడా ఈజీగా దాటేస్తుందని అల్లు అర్జున్ ఫాన్స్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ఇక ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు పుష్ప 2 సిద్ధమైంది.