ప్రముఖ బాలీవుడ్ నటి జరీనా వాహబ్ రీసెంట్ గా ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో హీరో ప్రభాస్ ని ఆకాశానికి ఎత్తేసేంది. వచ్చే జన్మంటూ ఉంటె ప్రభాస్ నాకు కొడుకుగా పుట్టాలని కోరుకుంటానని చెప్పింది. రాజా సాబ్ సెట్స్ లో తోటి నటులతో ప్రభాస్ చూపించే ఆప్యాయత తనకు ఎంతగానో నచ్చింది అని ఈ బాలీవుడ్ నటి తెలిపింది. రాజా సాబ్ లో వీరిద్దరూ ఒకే స్క్రీన్ లో కనిపించబోతున్నారు.
ప్రభాస్ తన తోటి నటీనటులతో ఒకే విధంగా ప్రవర్తిసాడని జరీనా వాహబ్ తెలిపింది. ప్రభాస్ లాంటి మనిషి ఇంకొకడు లేడు, ఉండబోడు అని చెప్పింది. వచ్చే జన్మ ఉంటె నాకు ఇద్దరు కొడుకులు కావాలి, ఒకడు నా సొంత కోడుకు సూరజ్ ఇంకో కొడుకు ప్రభాస్ కావలి.
అసలు ప్రభాస్ కి ఎటువంటి ఇగో లేదని, షూటింగ్ లో ప్యాక్ అప్ చెప్పాక అందరికి బాయ్ చెబుతాడని జరీనా తెలిపింది. ఇక సెట్స్ లో ఎవరికైనా ఆకలిగా ఉందని అంటే చాలు ఇంటికి కాల్ చేసి మరి ఓక 30, 40 మందికి సరిపడే భోజనాలు తెప్పిస్తాడని తెలిపింది. అసలు ఆ మనిషి ఎంత మంచోడో నేను మాటల్లో చెప్పలేను, నేను కోరుకునేది ఒకటే అతనికి అల్లా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి, నిండు నూరేళ్లు చల్లగా బ్రతకాలి అని కోరుకుంటాను అని జరీనా తెలిపింది.
రీసెంట్ గా ప్రభాస్ 45వ బర్త్ డే సందర్బంగా మూవీ టీమ్ రాజా సాబ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు, దానికి ఫాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మారుతీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10 2025 లో విడుదల కానుంది. ప్రభాస్ లీడ్ రోల్ చేస్తుండగా, నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్, సంజయ్ దత్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది.