ముంబై లోని అంధేరిలో 25 ఏళ్ల ఎయిర్ ఇండియా పైలట్ శ్రిష్థి తులి సోమవారం ఉదయం తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది. ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె బాయ్‌ఫ్రెండ్ ఆదిత్య (27) ను పోలీసులు అరెస్టు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన శ్రిష్థి ఆదిత్యతో రిలేషన్ షిప్ సరిగ్గా లేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదిత్య తరచుగా ఆమెను దూషించేవాడని, వారు ఆరోపించారు. రీసెంట్ గా గురుగ్రామ్‌లో జరిగిన ఫంక్షన్ లో శ్రిష్థి నాన్ వెజ్ తిన్నందుకు ఆదిత్య అందరిముందు ఆమెను అవమానించాడని పేర్కొన్నారు.
ఆదివారం రాత్రి, డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన శ్రిష్థి , అప్పటికి ఇంట్లో ఉన్న ఆదిత్యతో గొడవపడింది. రాత్రి 1 గంట ప్రాంతంలో ఆదిత్య ఢిల్లీకి వెళ్లిపోయాడు. తరువాత, శ్రిష్థి అతనికి కాల్ చేసి తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు ఆదిత్యకు చెప్పింది. దీంతో కంగారుపడిన ఆదిత్య తిరిగి ఆమె అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు, కానీ తలుపుకు తాళం వేసి ఉండటంతో లోపలికి వెళ్ళలేకపోయాడు. దీంతో తాళాలు తయారుచేసే అతని సాయం తీసుకుని తలుపు తెరిపించి లోపలకి వెళ్లి చూసేసరికి ఆమె అచేతనంగా పడిఉంది. ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ లాభం లేకుండా పోయింది, అప్పటికే మృతిచెందింది.
అయితే తరుచు ఆదిత్య వేధింపుల వల్లే శ్రిష్థి చనిపోయిందని కుటుంబ సభ్యులు అంటున్నారు. శ్రిష్థి తను సూసైడ్ చేసుకుంటున్నాని చెప్పినప్పుడు అతను ఎందుకు పోలీసులను సంప్రదించలేదని వారు ప్రశ్నించారు. ఆదిత్య ఘటనా స్థలాన్ని టాంపర్ చేశాడని ఆరోపించారు. ,కానీ పోలీసులు దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమీ దొరకలేదు అని చెబుతున్నారు. .
కుటుంబ సభ్యుల వివరాలు మేరుకు గత నెలలో శ్రిష్థి తన బ్యాంకు ఖాతా నుంచి ఆదిత్యకు ₹65,000 రూపాయలు పంపింది. ఇక పోస్టుమార్టం నివేదిక ప్రకారం, శ్రీష్టి ఉరి వేసుకుని మరణించినట్లు తేలింది, ఇది ఆత్మహత్యనా లేదా అనుమానాస్పద మరణమా అనే ప్రశ్నలు లేవనెత్తింది. ఘటనా స్థలంలో ఎలాంటి లెటర్ దొరకలేదు.