యుకె లోని జేమ్స్ హావెల్స్ అనే అతను పొరపాటున లాప్ టాప్ హార్డ్ డ్రైవ్ పోగొట్టుకున్నాడంట. అయితే అది సాధారణ హార్డ్ డ్రైవ్ కాదు దాని విలువ సుమారు 5,900 కోట్లు ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే జేమ్స్ 2009లో 8000 బిట్ కాయిన్ లు మైనింగ్ చేసాడు. అప్పట్లో బిట్ కాయిన్ కనీసం 1 డాలర్ కూడా లేదు. కానీ ఇప్పుడు బిట్ కాయిన్ వాల్యూ 78 లక్షలకు చేరింది.
అయితే అతను హార్డ్ డ్రైవ్ ఎలా పోగొట్టుకున్నాడు అంటే, ఒక రోజు తన ఇంట్లోని డస్ట్ బిన్ బ్యాగ్స్ ని పడెయ్యమైని తన గర్ల్ ఫ్రెండ్ అయిన హల్ ఫినాకి జేమ్స్ చెప్పాడు. అయితే ఆ చెత్తలో అందులో హార్డ్ డ్రైవ్ కూడా ఉంది. అది చూసుకోకుండా తన గర్ల్ ఫ్రెండ్ ఆ చెత్తను పడేసింది. అయితే ఇప్పుడు ఆ లక్ష టన్నుల చెత్త అడుగున ఉండిపోయింది.
జేమ్స్ గత 10 ఏళ్లుగా హార్డ్ డ్రైవ్ ని ఆ చెత్త నుండి వెలికి తీయమని అక్కడి పాలక మండలి అధికారులని ప్రాధేయపడుతున్నాడు. అయితే ఎక్కడ పర్యావరణానికి హాని కలుగుతుందో అని వారు జేమ్స్ కి పెర్మిషన్ ఇవ్వడం లేదు. ఆ హార్డ్ డ్రైవ్ విలువ ఇప్పుడు కొన్ని వేల కోట్లు ఉంటుందని అని అక్కడి అధికారులకి నచ్చ జెప్పి చూసాడు. ఆఖరికి న్యూపోర్ట్ సిటీ పలకమండలకి 10% విలువగల బిట్ కాయిన్స్ ను విరాళం గా ఇస్తానని ప్రకటించాడు. అయినా వారు ససేమీరా అంటున్నారు.
అయితే జేమ్స్ తనకు న్యూపోర్ట్ సిటీ పాలక మండలి 4,900 కోట్లు నష్ట పరిహారం ఇవ్వవలసిందిగా కోర్టులో కేసు వేసాడు. ఎందుకంటే వారు తన హార్డ్ డ్రైవ్ ని వెతకటానికి ఒప్పుకోవడం లేదు గనుక. ఇక జేమ్స్ తన హార్డ్ డ్రైవ్ ని వెతుక్కోవచ్చా లేదా అనేది కోర్టు డిసెంబర్ లో తీర్పు చెప్పనుంది.
అయితే తన గర్ల్ ఫ్రెండ్ హల్ ఫినా ఆ డస్ట్ బిన్ బ్యాగ్స్ లో హార్డ్ డ్రైవ్ నాకు కనిపించలేదు అని చెపుతుంది. అయినా అతనికి హార్డ్ డ్రైవ్ గనుక కనిపిస్తే నాకు ఒక్క పైసా కూడా అక్కర్లేదని హల్ ఫినా అంటుంది. అది కనిపిస్తే కనీసం అతనికి మనశ్శాంతి అయినా దక్కుతుంది అని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.