సికింద్రాబాద్‌లోని అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్‌లో విషాదం చోటుచేసుకుంది. విరేన్ జైన్ అనే 11 ఏళ్ల విద్యార్థి లంచ్ బ్రేక్ లో పూరీలు తింటుండగా అవి గొంతులో ఇరుక్కుని ఊపిరాడక మృతి చెందాడు.
మధ్యాహ్నం 12.20 కి మూడు పూరీలు కలిపి ఒకేసారి తినడంతో, గొంతులో ఇరుక్కుంది. దీంతో ఊపిరాడక ఇబ్బంది పడ్డాడు. ఇదే విషయాన్ని12.45కి స్కూల్ సిబ్బంది . విరేన్ జైన్ తండ్రి గౌతమ్ జైన్ కి తెలియజేసారు.
స్కూల్ మ్యానేజ్మెంట్ విరేన్ ని వెంటనే మారేడ్పల్లి లో గల ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు సికింద్రాబాద్ లోని పెద్ద ఆసుపత్రికి తరలించాల్సిందిగా కోరారు. అయితే అంబులెన్స్ లో హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పటికే చనిపోయాడు అని డాక్టర్లు తెలిపారు.
స్కూల్ మ్యానేజ్మెంట్ మరియు ఆసుపత్రి సిబ్బంది తమ కొడుకును కాపాడడానికి ఎంతో ట్రై చేశారని వాళ్ళ తప్పేమి లేదని పోలీసుల రిపోర్ట్ లో వీరేన్ తండ్రి గౌతమ్ జైన్ పేర్కొన్నారు. అనంతరం వీరేన్ భౌతిక కాయాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరేన్ జైన్ కి 7 ఏళ్ల చెల్లెలు ఉంది.