నాగ చైతన్య మరియు శోభిత ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4 న చేసుకోబోతున్నారు. వారి వివాహం తెలుగు సాంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా జరగనుంది. తెలుగు బ్రాహ్మణ ఆచారాల ప్రకారం ఈ వేడుక ఎనిమిది గంటలకు పైగా సాగనుందని సమాచారం. తెలుగు సాంప్రదాయంలో అన్ని ఆచారాలను దృష్టిలో పెట్టుకుని వివాహం చేసుకోవాలనేది ఈ జంట కోరిక అట.
ఓ ఇంటర్వ్యూలో హీరో నాగార్జున ఇలా అన్నారు, చైతన్య, శోభిత సింపుల్ గా మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకున్నారు. మొత్తం ఏర్పాట్లు అన్ని వారే చూసుకుంటాం అన్నారు. శోభిత పేరెంట్స్ సాంప్రదాయ రీతిలో వివాహం చేద్దాం అన్నారు, నేను దానికి సపోర్ట్ చేసాను. ఇలాంటి వేడుకలు ఆనందాన్ని, మనశ్శాంతిని కలుగజేస్తాయని హీరో నాగార్జున అభిప్రాయపడ్డారు.
ఇక పెళ్ళికి శోభిత దూళిపాళ్ళ ఒక అందమైన కాంజీవరం సిల్క్ చీరను సెలెక్ట్ చేసింది. నాగ చైతన్య డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలా పొందూరు లో ఒక వైట్ ఖాదీ శారీని ఆర్డర్ ఇచ్చినట్లు సమాచారం. పెళ్లి వ్యవహారాలకు సంబంధించి అన్ని విషయాల్లో శోభిత ఇన్వాల్వ్ అవుతుందట.