రాంచరణ్ మూవీలోకి జగ్గు భాయ్ ఎంట్రీ!

Jagapathi Babu Joins the Bandwagon of Ramacharans next project RC-16

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” జనవరి 10, 2025న విడుదల కానుంది. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారు . ఇదే సమయంలో, హీరో  రామ్ చరణ్ తదుపరి ప్రాజెక్ట్ అయిన  RC 16 పనులు కూడా చకచకా సాగిపోతున్నాయి. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ నిన్న మైసూరులో ప్రారంభమైంది.

ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్‌,  మూవీ మీద అంచనాలను మరింత పెంచేసింది. ప్రముఖ నటుడు జగపతి బాబు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా  విడుదలైన జగపతిబాబు పోస్టర్ సినిమా అంచనాలను పెంచింది.

ఇక RC 16లో రామ్ చరణ్‌తో పాటు బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.   ఈ చిత్రంలో కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రపంచ ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఏఆర్ రహ్మాన్ స్వరాలందించడం మరో ప్రత్యేకత. ఆయన సంగీతం సినిమాకు ప్రాణం పోస్తుందని మేకర్స్ విశ్వసిస్తున్నారు. “వృద్ధి సినిమాస్,  సుకుమార్ రైటింగ్స్  , మైత్రీ మూవీ మేకర్స్” సమర్పణలో ఈ భారీ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

అద్భుతమైన తారాగణం, ప్రతిభావంతమైన సాంకేతిక నిపుణులు, స్ఫూర్తిదాయకమైన కథాంశం కలగలిపి, RC 16 పాన్-ఇండియా చిత్రంగా ప్రేక్షకులను అలరించనుంది. ఒక పక్క రామ్ చరణ్ అభిమానులు గేమ్ ఛేంజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, RC 16పై హైప్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ చిత్రంతో రామ్ చరణ్ తన కెరీర్‌లో మరో ముఖ్యమైన మైలురాయిని అందుకోవడం ఖాయమని మెగా ఫాన్స్ భావిస్తున్నారు.

By viralkaburlu.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

No widgets found. Go to Widget page and add the widget in Offcanvas Sidebar Widget Area.