తల్లి అనే పదానికి మచ్చ తెచ్చింది ఓ మహిళ, తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని తన లవర్ తో కలిసి కన్న పిల్లల్ని చంపుకుంది. చివరికి ఓ కాటికాపరి పోలీసులను అలెర్ట్ చేయడంతో పాపం పండి ఇద్దురూ కటకటాల పాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలోని బెంగుళూరుకి చెందిన 25 ఏళ్ల స్వీటీ అనే మహిళకి “శివు” అనే అతనితో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు సంతానం. 2 ఏళ్ల పాప మరియి 11 నెలల బాబు ఉన్నారు.
అయితే రెండు నెలల క్రితం ఓ పార్కులో ఫ్రాన్సిస్ అనే అతనితో స్వీటీ కి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఎఫైర్ గా మారింది. కొన్ని రోజులకి వీరు ఓ చోట రూమ్ ని రెంట్ కి తీసుకున్నారు.
అయితే వీరి వ్యవహారానికి పిల్లలు అడ్డుగా ఉన్నారన్న కోపంతో ఆ మహిళ అక్టోబర్ ఒకటవ తారీఖున తన కూతుర్ని కొట్టి చంపేసింది. ఆ పిమ్మట అక్టోబర్ 7వ తారీఖున 11 నెలల పసికందుని చంపేసింది.
ఇక వారం వ్యవధిలోనే తన ఇద్దురు పిల్లల్ని స్మశాన వాటికలో ఖననం చేయడంతో కాటికాపరికి అనుమానం వచ్చింది. మొదట కూతురిని ఖననం చేసినప్పుడు ఎదో జబ్బు వల్ల చనిపోయింది అని కాటికాపరికి ఎదో చెప్పి మ్యానెజ్ చేశారు. కానీ వారం వ్యవధిలోనే మళ్ళీ ఓ పసికందును స్మశానానికి తీసుకురావడంతో, అనుమానం వచ్చిన కాటికాపరి వీడియో తీసి పోలీసులకు పంపండంతో అలెర్ట్ అయిన పోలీసులు ఈ జంటను అరెస్ట్ చేశారు.
కేసు నమోదు చేసిన కర్ణాటకకు చెందిన ఐజూర్ పోలీసులు వీరిద్దరిని స్టేషన్ కి తరలించి విచారించగా మాకు అడ్డుగా ఉన్నారని తామే పిల్లల్ని హతమార్చినట్లు ఒప్పుకున్నారు. ఇంకోపక్క బెంగుళూరు లోని డీజే హళ్లి పోలీస్ స్టేషన్ లో స్వీటీ భర్త, సెప్టెంబర్ 17 తన భార్య ఇద్దరు పిల్లల్తో ఇంట్లో నుండి వెళ్లిపోయిందని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు.