- ఆర్య రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు
- అల్లు అర్జున్, సుకుమార్ కి లైఫ్ ఇచ్చిన సినిమా
- ఈ సినిమాతో అమాంతం పెరిగిపోయిన అల్లు అర్జున్ క్రేజ్
- ప్రేమ కధా చిత్రాల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన చిత్రం
- నాలుగు కోట్లు బడ్జెట్ పెడితే ఏకంగా 30 కోట్లు వచ్చాయి
“ఆర్య” కేవలం ఒక సినిమా మాత్రమే కాదు ఏంతో మంది జీవితాలు మార్చిన సినిమా. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని కలల్ని నిజం చేసిన సినిమా. ఇదంతా సుకుమార్ తో ప్రారంభం అయ్యింది. తన కలను నిజం చేసుకోవడానికి 30,000 జీతం వచ్చే టీచర్ ఉద్యోగ్యానికి సైతం రాజీనామా చేసి హైదరాబద్ వచ్చేసాడు. ఎం.ఎస్ ఆర్ట్స్ సంస్థలో సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రోజులవి. దిల్ సినిమాలో పనిచేయాలని వి.వి వినాయక్ నుండి పిలుపు వస్తే అక్కడికి వెళ్ళాడు. “దిల్” సినిమా కి పనిచేస్తున్న సందర్భంలో అదును చూసుకుని దిల్ రాజుకి వన్ సైడెడ్ లవ్ స్టోరీ చెప్పాడు.
మొదట్లో దిల్ రాజు సంశయించినా తర్వాత సుకుమార్ తో కలిసి చేద్దామని ఓకే చెప్పేసాడు. ఈ లోగా దిల్ సినిమా హిట్ అయ్యింది. అదే కాన్ఫిడెన్స్ తో ఆర్య సినిమా మొదలుపెట్టారు. ఒక పర్ఫెక్ట్ హీరో కోసం వెతికారు. అప్పుడు అల్లు అర్జున్ వారి సినిమాకి సెట్ అవుతారు అనిపించింది. ఇండస్ట్రీ పెద్దలు చిరంజీవీ, అల్లు అరవింద్ సపోర్ట్ తో సినిమా ముందుకు కదిలింది. సుకుమార్ డైరెక్షన్ బాధ్యతలు తీసుకోగా, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా, రత్నవేలు సినిమాటోగ్రఫర్ గా, అను మెహతాని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు.
ఇక కొన్ని నెలలు టీమ్ అంతా కష్టపడి పనిచేశారు. 2004 మే 5వ తారీఖున ఆర్య సినిమా రిలీజ్ అయ్యింది. ఇక మిగితాది అంతా హిస్టరీ. మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ అందర్నీ కట్టిపడేసింది. సాంగ్స్ కూడా సూపర్ హిట్. ఎక్కడ విన్నా ఆర్య సాంగ్సే. మొదటి రోజు రెస్పాన్స్ కొంచెం స్లోగా స్టార్ట్ అయినా మరుసటి రోజు నుండి టికెట్స్ సైతం దొరకలేదు. ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి.ఈ సినిమాకు నాలుగు కోట్లు బడ్జెట్ పెడితే ఏకంగా 30 కోట్లు వచ్చాయి. . అప్పటి నుండి అల్లు అర్జున్ ఓ స్టార్ గా ఎదుగుతూ వచ్చాడు. ఇప్పుడు ఐకాన్ స్టార్ గా మారాడు.ఇక ఆర్య రిలీజ్ అయ్యి 20 సంత్సరాలు గడిచాయి. లేటెస్ట్ గా వీరిద్దరి కాంబో లో పుష్ప – 2 రాబోతుంది. ఆగస్టు 15న ఈ చిత్రం విడుదల కాబోతుంది.