- క్రికెట్ బాల్ మర్మాంగాలకి తగలడంతో 11ఏళ్ల బాలుడు మృతి
- ఫ్రెండ్స్ తో సరదాగా క్రికెట్ ఆడుతుండగా బాలుడు మృతి
- ప్రాణం తీసిన క్రికెట్ సరదా
- పుణెలోని లోహేగావ్ లో ఘటన
క్రికెట్ బాల్ వచ్చి మర్మాంగాలకి బలంగా తగలడంతో మహారాష్ట్ర పూణే సిటీ లోని లోహేగావ్ ప్రాంతానికి చెందిన 11ఏళ్ళ బాలుడు మృతి చెందాడు.
వివరాల్లోకి వెళ్తే ఎప్పిటిలాగానే 11ఏళ్ళ శౌర్య తన ఫ్రెండ్స్ తో సరదాగా క్రెకెట్ ఆడుకుంటున్నాడు. స్కూల్స్ కి సమ్మర్ హాలిడేస్ ఇవ్వడంతో తన ఫ్రెండ్స్ తో రోజా క్రికెట్ ఆడుతున్నాడు. కానీ అదే క్రికెట్ సరదా తన ప్రాణం తీస్తుందని అనుకొలెదు. శౌర్య బాలింగ్ చేస్తుండగా బ్యాటింగ్ చేస్తున్న తన ఫ్రెండ్ బాల్ ని గట్టిగా కొట్టడంతో శౌర్య మర్మాంగాలకి బలంగా తాకింది దీంతో శౌర్య అక్కడే కుప్పకూలిపోయాడు.
బాల్ గట్టిగా తగలడంతో ఉన్నచోటనే భరించలేని నొప్పితో గ్రౌండ్ లో కిందపడిపోయాడు. ఈ ఘటనతో తన ఫ్రెండ్స్ షాక్ గురయ్యి హుటాహుటిన శౌర్య వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికే స్పృహ కోల్పోయిన శౌర్యాని అటుగా వెళ్తున్న వ్యక్తులు గమనించి దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.
కానీ ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే 11 ఏళ్ల శౌర్యాని డాక్టర్లు కాపాడలేక పోయారు. కొద్దిసేపటికే ఆ బాలుడు మృతి చెందాడు.ప్రమాదవశాత్తు మరణించినట్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.