- తీవ్ర గాయాలపాలైనా ఎగ్జామ్స్ రాసిన 10వ క్లాస్ విద్యార్థిని
- వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటూ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థిని
- టెన్త్ రిజల్ట్స్ లో హై గ్రేడ్ మార్క్స్ సాధించిన అమ్మాయి
దృఢ నిశ్చయం, సంకల్ప శక్తి ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అని ఓ 10వ క్లాస్ అమ్మాయి నిరూపించింది. వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసి ఇటీవలే విదులైన ఫలితాల్లో హై గ్రేడ్ మార్కులను సాధించింది. వివరాల్లోకి వెళ్తే నాంపల్లి ప్రాంతానికి చెందిన కిర్పన్ కౌర్ ఖనూజా అబిడ్స్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో చదువుతుంది. మార్చ్ 1వ తారీఖున ప్రీ ఫైనల్ ఎగ్జామ్ రాసి ఇంటికి తిరిగి వస్తుండగా తల్లి, కూతుర్లను అటుగా వెళ్తున్న వాహనదారుడు వీరిని వేగంగా ఢీకొట్టాడు. దీంతో కిర్పన్ కౌర్ తీవ్రంగా గాయపడింది.
వెంటేనే నాంపల్లిలోని కేర్ ఆసుపత్రికి తరలించగా ఆమెకు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవ్వడంతో వెంటనే డాక్టర్లు ట్రీట్మెంట్ను మొదలుపెట్టారు. ఆపరేషన్ అయిపోగానే కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని కిర్పన్ కౌర్ పేరెంట్స్ కి చెప్పారు. కానీ దీనికి కిర్పన్ కౌర్ ఒప్పుకోలేదు. బెడ్ రెస్ట్ తీసుకుంటే టెన్త్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ మిస్ అయిపోతానని నేను ఎగ్జామ్స్ రాయాల్సిందే అని తన పేరెంట్స్ తో కిర్పన్ కౌర్ వారించింది.
టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ మీద సప్లిమెంటరీ అనే పదం కనపడకూడదు అనుకుంది. తల్లిదండ్రులు ఎంత చెప్పినా ఆ అమ్మాయి వినిపించుకోలేదు. కానీ తమ అమ్మయికి చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ చూసి వారు కూడా కాదనలేకపోయారు. పేరెంట్స్ మరియు డాక్టర్స్ అబ్సర్వేషన్ మధ్యన వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ టెన్త్ క్లాస్ ఎగ్సామ్స్ ను ఆ అమ్మాయి రాసింది.
మొదట్లో డాక్టర్ లు సైతం ఈ అమ్మాయిని ఎగ్సామ్స్ రాస్తానికి ఒప్పుకోలేదు. కానీ ఈమే పట్టుదలను చూసి డాక్టర్లు కూడా చివరికి ఒప్పుకోక తప్పలేదు. ఇక రీసెంట్ గా వచ్చిన ఫలితాల్లో తన కూతురు మంచి మార్కులు సాధించడంతో కన్నతల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ వార్తను చూసిన చాలామంది కిర్పన్ కౌర్ ను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.