- హైదరాబాద్ లో విషాదం
- వాటర్ సంప్ లో పడి సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి!
- సీసీటీవీలో చిక్కిన దృశ్యం
- గచ్చిబౌలిలో ఘటన
గచ్చిబౌలిలోని అంజయ్య నగర్లో గల ఓ హాస్టల్ లో ఆదివారం నాడు విషాదం చోటు చేసుకుంది. 22 ఏళ్ల షైక్ అక్మల్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి బయట సరకులు తీసుకుని హాస్టల్ లోపలికి వెళ్తుండగా వాటర్ సంప్ లో పడి తలకి తీవ్రగాయాలు అవడంతో మృతి చెందాడు.
ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. సీసీటీవీ లో రికార్డ్ అయిన దృశ్యం ప్రకారం షేక్ అక్మల్ వాటర్ సంప్ లో పడిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ లో నివసించే భార్య, భర్తలు మొదట ఈ విషయాన్ని గమనించారు. వెంటనే సదరు వ్యక్తి సంప్ లోకి వాటర్ పైపు జారవిడిచాడు. అయితే ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఆ వ్యక్తి తన ప్రయత్నాన్ని కొనసాగించాడు.
ఈ ఘటన జరిగిన తరువాత భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు హాస్టల్ ఓనర్ పై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
#Hyderabad– A 25-year-old software employee Shaik Akmal Sufuyan,tragically lost his life after falling into a water sump built underground at a hostel in Anjaya Nagar, within the jurisdiction of #Rayadurgam Police Station.
The accident, caused by the open lid of the water sump,… pic.twitter.com/P4rHwtMlAd
— Mohd Dastagir Ahmed (@Dastagir_Hyd) April 22, 2024