- ఆగస్టు 15న భారీ అంచనాలతో పుష్పా -2 ది రూల్ రిలీజ్
- హిందీలో పుష్పా -1 సూపర్ డూపర్ హిట్
- 200 కోట్లు పెట్టి నార్త్ ఇండియా రైట్స్ సొంతం చేసుకున్న AA FILMS
- 275 కోట్లు పెట్టి OTT హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ సంస్థ
- తెగ ఖుషీ అల్లు అర్జున్ ఫాన్స్
ఈ ఏడాది ఆగస్టు 15న భారీ అంచనాలతో పుష్పా -2 ది రూల్ రిలీజ్ కాబోతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే పుష్పా మూవీకి నార్త్ ఇండియాలో క్రేజ్ మాములుగా లేదు. 2021 డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ హిందీలో సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
అందుకే పుష్పా – 2 హక్కులని సొంతం చేసుకోవడానికి చాలా మంది హిందీ ప్రొడ్యూసర్స్ పోటీ పడుతున్నారు. అయితే తాజాగా పుష్పా – 2 నార్త్ ఇండియా ధియేటర్ హక్కులను AA ఫిలిమ్స్ సంస్థ 200 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇంత వరకు ఏ తెలుగు సినిమాకి ఇలాంటి రికార్డ్ లేదు. అంతేకాదు 275 కోట్లు పెట్టి నెట్‌ఫ్లిక్స్ సంస్థ OTT హక్కులను సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఈ న్యూస్ తెలుసుకున్న అల్లు అర్జున్ ఫాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారట.
అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ లో అల్లు అర్జున్ పూర్తి విభిన్నమైన లుక్ లో కనిపించాడు. ఇక హీరోయిన్ సమంత మరియు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అతిధి పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తుంది.
ఇక 2021 లో విడుదలైన పుష్పా – 1, 350 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్ళను రాబట్టింది. అంతేకాదు అల్లు అర్జున్ కి ఈ సినిమా నేషనల్ అవార్డును తెచ్చి పెట్టడం విశేషం.