ప్రపంచం అంతా కొవిడ్ మహమ్మారితో అతలాకుతలం అవుతున్నప్పుడు, కరోనా వైరస్ మరింత ప్రబలకుండా కేంద్ర ప్రభుత్వం దేశమంతా లాక్ డౌన్ విధించడంతో, సాఫ్ట్ వేర్ కంపెనీలు తమ ఉద్యోగుల కు వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవచ్చని తెలిపాయి. ఇప్పటికి చాలా మంది ఇంటి నుండే వర్క్ చేసుకుంటున్నారు. కరోనా పుణ్యమా అంటూ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ కి అలవాటు పడటంతో కొన్ని కంపెనీలు వారానికి రెండు సార్లన్నా ఆఫీసులకు రావాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే తాజాగా ఈ లిస్ట్ లో టీసీఎస్ కంపెనీ చేరింది.
ఇక ఉద్యోగులందరని ఆఫీసులకి రావాల్సిందిగా కోరుతోంది. ఇంటి నుండి పనిచేయడం వల్ల వారు ఎన్నో ప్రయోజనాలు మిస్ అవుతున్నారని టీసీఎస్ మేనేజ్మెంట్ అంటోంది. ఆఫీస్ నుండి పనిచేస్తే ప్రొమోషన్ల తో పాటు వేతనాల పెంపు లాంటి బెనిఫిట్స్ ఉంటాయంటోంది.
ఆఫీస్ నుండి పని చేస్తే టీమ్ బిల్డింగ్ తో పాటు, కొత్త స్కిల్స్ నేర్చుకోవచ్చని టీసీఎస్, సీఈఓ కృతి వాసన్ అంటున్నారు. ఆన్లైన్ మీటింగ్స్ లో పాల్గొనే కంటే, తమ సహచరులతో కలిసి పని చేస్తే పనితీరు బాగుంటుందని, తమ కంపెనీ అభివృద్ధికి కూడా దోహద పడుతోందని ఆయన తెలిపారు.
అయితే కరోనా సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకొంటున్న ఐ.టీ కంపెనీలు,వర్క్ ఫ్రొం హోమ్ కల్చర్ కు క్రమక్రమంగా స్వస్తి పలుకుతున్నాయి. ఇప్పుడు తాజా గా A.I. టెక్నాలజీ రాకతో ఉద్యోగ నియామక ప్రక్రియలు కొంచెం స్లో అయ్యాయి. గూగుల్, అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగులను తీసేస్తోంటే. టీసీఎస్ మాత్రం A.I తో ఇప్పుడున్న ఉద్యోగాలకు ముప్పేమీ లేదంటోంది., కానీ ఫ్యూచర్ లో ఆ ప్రభావం ఉద్యోగ నియామకాలపై ఉండొచ్చని అంటోంది.
కానీ ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు కోల్పోకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు కొత్త స్కిల్స్ నేర్చుకోమని టీసీఎస్, సీఈఓ, కృతి వాసన్ అభిప్రాయపడ్డారు.
ALSO READ తమిళనాడులో పీచు మిఠాయి అమ్మకాలపై నిషేధం!