తమ సంస్థ పేరుని , లోగోని వాడుకొని సాధారణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న దాదాపు 30 ట్విట్టర్ ఖాతాల లిస్ట్ ను CBSE బోర్డు రిలీజ్ చేసింది.
CBSE పేరు మీద అనేక నకిలీ ఖాతాలు ఉన్నాయని, కానీ x.com లో @cbseindia29 అనే ఖాతా మాత్రమే అధికారిక ఖాతా అని,ఆ ఖాతాను మాత్రమే ఫాలో అవ్వాల్సిందిగా విద్యార్థులకు CBSE అధికారులు తెలిపారు.
ఇలాంటి ఫేక్ ఖాతాలపై చర్యలు తీసుకుంటున్నాం, కావున అధికారిక ఖాతాను మాత్రమే ఫాలో అవ్వండని. CBSE బోర్డు తెలిపింది.
ఇదిలాఉండగా, CBSE 10వ తరగతి 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న ప్రారంభం కానున్నాయి. వీటికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ ఇప్పటికే రిలీజ్ చెయ్యడం జరిగింది.