ఏదో సరదా కోసం పారాగ్లైడింగ్ చేద్దామని ముచ్చటపడిన ఆ యువతికి, అదే సరదా తన ప్రాణం తీసింది. . వివరాల్లోకి వెళితే తెలంగాణలోని జహీరాబాద్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల నవ్య పారాగ్లైడింగ్ చేద్దామని హిమాచల్ ప్రదేశ్ లోని కులు ప్రాంతానికి వెళ్ళింది.
అక్కడ సరదాగా పారాగ్లైడింగ్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిద్దాం అనుకుంది. పారాగ్లైడర్ ఎక్కింది. అయితే సదరు పైలట్ నవ్యాకి బెల్ట్ సరిగ్గా బిగించకపోవడంతో, బెల్ట్ ఊడిపోయి, ఎత్తు నుండి కింద పడి మృతిచెందింది.
స్పాట్ కి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి, కుంటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పైలట్ ను అరెస్ట్ చేసి జైలుకి తరలించినట్లు సమాచారం.
అయితే ఆ పైలట్ పర్యాటక శాఖ వద్ద నమోదు చేసుకున్నాడని, అతను వాడే పరికరాలు కూడా మావద్ద అనుమతి పొందినవే అని, కులు టూరిజం ఆఫీసర్ సునైన శర్మ తెలిపారు. ఇది ఖచ్చితంగా మానవ తప్పిదమే అని ఆమె అన్నారు.