రోజూ పొద్దునే లేవగానే ఓ చెంచాడు నెయ్యి తాగితే చాలు, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
నెయ్యిలో సంతృప్త కొవ్వులు పుష్కలంగా ఉండటం వలన రోజంతా అలసట లేకుండా ఉంటుందని, నెయ్యిని రెగ్యులర్ గా తీసుకుంటే త్వరగా జీర్ణం అవ్వటంతో పాటు, కడుపు నిండిన భావనను కలగజేస్తుందని వారంటున్నారు.
నెయ్యిలో విటమిన్ A, E, D లు ఉండటంతో రోగనిరోధక శక్తి సరిగ్గా పనిచేయడంలో దోహద పడుతుంది. అలాగే చర్మ ఆరోగ్యం తో పాటు ఎముకల బలంగా ఉండడానికి దోహదం చేస్తుందట.
అలాగే మధుమేహం కంట్రోల్ లో ఉంచడానికి ప్రతిరోజు నెయ్యి తీసుకోవచ్చని డైటీషియన్ లు సలహా ఇస్తున్నారు. . Glycemic ఇండెక్స్ తక్కువ ఉన్నందువల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. రోజంతా శరీరానికి స్థిరంగా శక్తిని ఇవ్వడంలో దోహదపడుతుంది.
ఇక ఇందులోని బ్యూటీరిక్ కొవ్వు పదార్ధాలు ఉండటంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాంగా ఉండి, మొత్తంగా మనిషి ఆరోగ్యాంగా ఉంటాడని హెల్త్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అందుకే ప్రతీరోజు పొద్దునే కనీసం ఓ చెంచాడు నేయి తీసుకోమని సలహా ఇస్తున్నారు.