తెలంగాణ ప్రభుత్వం ఆదివారం నాడు పద్మ అవార్డు గ్రహీతలను సత్కరించిన విషయం అందరికి తెలిసిందే. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరు మాట్లాడుతూ పద్మ అవార్డులు ప్రకటించిన వెంటనే అవార్డు గ్రహీతలను సన్మానించడం బహుశా ఇదే మొదటి సారి అని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు ఇలా ఎప్పుడు చేయలేదన్నారు.
అయితే గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితల్లో వ్యక్తిగత దూషణలకే ఎక్కువ ప్రాధ్యాన్యం ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యకం చేశారు. ఇలాంటి వ్యక్తిగత దూషణల వల్లే నేను ఆనాడు రాజకీయాల నుండి బయటకు వచ్చేసా అని చిరు అన్నారు.
అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఎవరన్నా వ్యక్తిగతంగా విమర్శిస్తే వాటిని బలంగా తిప్పిగొట్టగలిగితేనే రాజకీయాల్లో ఉండగలమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలాఉండగా ప్రస్తుతం పొందిన పద్మ విభూషణ్ అవార్డు కంటే గతంలో అందుకున్న పద్మ భూషణ్ అవార్డే ఎక్కువ సంతోషాన్ని కలిగించింది అని ఆయన అన్నారు. అయితే నాకు పద్మ విభూషణ్ అవార్డు లభించింది అని తెలియగానే అనేక మంది నాపై ప్రశంసలు కురిపించడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు.
అలాగే నంది అవార్డు పేరు మార్చి దివంగత ప్రజా గాయకుడైన గద్దర్ పేరు మీద అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగ్గ విషయమని మెగాస్టార్ అన్నారు.